కంప్యూటర్ అంటే ఏమిటి? What is Computer in Telugu | Types of Computer

0

Table of Contents

కంప్యూటర్ అంటే ఏమిటి? | What is Computer in Telugu

About Computer in Telugu: కంప్యూటర్ అనేది ఒక Electronic michion. దీనిని సమాచారంతో పని చేయడానికి రూపొందించబడింది. కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం “computare” నుండి వచ్చింది. దీని అర్ధం Calculation చేయడం.

computer in telugu

ఇందులో ముఖ్యం గా మూడు పనులు ఉంటాయి. మొదటిది Data ని తీసుకోవడం మనం Input అంటాం. రెండోది ఇచ్చిన Data ని Processing చేయడం. తర్వాత మూడోవా పని processed data ని Output రూపంలో చూపించడం.

💻
Input Data → Processing →  Output Data

కాబట్టి మనం Computer‌ ను వినియోగదారు నుండి ముడి డేటాను input రూపంలో తీసుకునే advanced ఎలక్ట్రానిక్ పరికరం అని పిలుస్తాము. ఇది ఆ data ని program (set of Instruction) ద్వారా ప్రాసెస్ చేస్తుంది మరియు తుది ఫలితాన్ని Output ‌గా ప్రచురిస్తుంది. ఇది numerical మరియు non numerical (arithmetic and Logical) calculation ని  process చేస్తుంది.

ఆధునిక కంప్యూటర్ల తండ్రిని Charles Babbage అంటారు. ఎందుకంటే అతను Mechanical కంప్యూటర్‌ను రూపొందించిన మొట్టమొదటి వక్తీ , దీనిని Analytical Engine అని కూడా పిలుస్తారు. ఇందులో, Punch Card సహాయంతో డేటా చేర్చబడింది.

 

కంప్యూటర్ యొక్క అర్ధం | Computer Meaning in Telugu

ఇప్పుడు మనం Computer యొక్క Telugu meaning ని తెలుసు కుందాం. సాదరణం గా కంప్యూటర్ అనే పదం ఇంగ్లిష్ లో పిలవబడే పదం మరి తెలుగులో కంప్యూటర్ ని “గణన యంత్రం” అని అంటారు. 

Computer = ” గణన యంత్రం “

కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి?| Full Foarm of Computer in Telugu

సాంకేతికంగా కంప్యూటర్ యొక్క పూర్తి రూపం లేదు.

C – Commonly , O – Operated, M – Machine, P – Particularly, U – Used for , T – Technical and E – Educational, R – Research

మీరు దీనిని తెలుగులో అనువదిస్తే అది ఇలా అవుతుంది, “సాధారణ ఆపరేటింగ్ మెషీన్ వ్యాపారం, విద్య మరియు పరిశోధన కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.”

కంప్యూటర్‌ను ఎవరు కనుగొన్నారు ? | Who is the Owner of the Computer

ఆధునిక కంప్యూటర్ యొక్క తండ్రి ఎవరు? ఈ Computing Field కు ఇలాంటి వారు చాలా మంది సహకరించారు. అయితే వీటన్నిటికీ మించి Charles Babage చాలా సహకారం అందించారు. ఎందుకంటే అతను 1837 లో వచ్చిన మొదటి Analytical Engine ని తయారు చేసారు .

ఈ ఇంజిన్‌లో ALU, Basic Flow control మరియు Integrated Memory concept అమలు చేయబడింది. కావున నేటి కంప్యూటర్ ఈ model పై ఆధారపడటం ద్వారా రూపొందించబడ్డాయి. అందుకే ఆయన సహకారం అత్యధికం.  అందుకే Charles Babage ని కంప్యూటర్ యొక్క తండ్రి అని  పిలుస్తారు.

కంప్యూటర్ యొక్క నిర్వచనం | Definition of Computer 

ఏదైనా modern digital కంప్యూటర్‌లో చాలా భాగాలు ఉన్నాయి కాని వాటిలో కొన్ని Input device , Output Device, CPU(Central Processing Unit), Mass Storage Device మరియు Memory. వంటివి చాలా ముఖ్యమైనవి.

accepts data Input
processes data Processing
produces output Output
stores results Storage

కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? | How to Work Computer in Telugu

Input (Data):  Input అనేది Input Device ఉపయోగించి కంప్యూటర్లో ముడి సమాచారం చేర్చబడిన step . ఇది అక్షరం, చిత్రం లేదా వీడియో కావచ్చు.

Process: ప్రక్రియ సమయంలో డేటా ఇన్పుట్ సూచనల ప్రకారం processing చేయబడుతుంది. ఇది పూర్తిగా Internal ప్రక్రియ.

Output: Output సమయంలో ఇప్పటికే process చేయబడిన data Result రూపంలో చూపబడుతుంది. మనకు కావాలంటే ఈ Result నిమెమరీలో save కూడా  చేసుకోవచ్చు మరియు భవిష్యత్ లో దానిని ఉపయోగించవచ్చు.

కంప్యూటర్ యొక్క ముఖ్య యూనిట్లు |Parts of Computer in Telugu

మీరు ఎప్పుడైనా కంప్యూటర్ కేసులో చూస్తే, లోపల చాలా చిన్న భాగాలు ఉండడం చూసే ఉంటారు , అవి చాలా complicated గా కనిపిస్తాయి, కానీ అవి నిజంగా అంత complicated గా ఉండవు. ఇప్పుడు, ఈ భాగాల గురించి మీకు కొంత సమాచారం ఇస్తాను.

Parts of Computer in Telugu

Motherboard

ఏదైనా కంప్యూటర్ యొధాన circuit board ను Motherboard అని అంటారు. ఇది సన్నని ప్లేట్ లాగా ఉంటుంది కాని ఇది చాలా వస్తువులను కలిగి ఉంటుంది. CPU, Memory, Connectors hard drive మరియు Optical Drive వంటి , కంప్యూటర్ యొక్క అన్ని పోర్టులకు కనెక్షన్‌తో పాటు expansion card Video మరియు Audio ను నియంత్రించడానికి పనిచేస్తుంది. చూసినట్లయితే, Motherboard కంప్యూటర్ యొక్క అన్ని భాగాలతో  directly గా కనెక్ట్ చేయబడింది.

CPU/Processor

Central Processing Unit అంటే CPU అంటే మీకు తెలుసా? దీనిని కూడా అంటారు. ఇది కంప్యూటర్ కేసు లోపల Motherboard లో కనిపిస్తుంది. దీనిని Computer మెదడు అని కూడా అంటారు. ఇది కంప్యూటర్‌లోని అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది. ప్రాసెసర్ యొక్క అధిక వేగం, వేగంగా processing చేయగలదు.

RAM

RAM ను Random Acess Memory గా కూడా మనకు తెలుసు. ఇది System యొక్క Short Term Memeory . కంప్యూటర్ కొన్ని లెక్కలు చేసినప్పుడు, అది తాత్కాలికంగా ర్యామ్ లో save అవుతుంది. కంప్యూటర్ షట్ డౌన్ అయితే, ఈ డేటా కూడా పోతుంది. మేము ఒక document వ్రాస్తుంటే, దానిని నాశనం చేయకుండా కాపాడటానికి, మన డేటాను మధ్యలో సేవ్ చేయాలి. సేవ్ చేయడం ద్వారా Data Hard Drive లో సేవ్ చేస్తే, అది చాలా కాలం పాటు ఉంటుంది.

Random Acess Memory ను megabytes (MB) లేదా gigabytes (GB) లో కొలుస్తారు. ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనకు అంతా మంచిది.

HardDrive

Hard Drive అనేది ఒక component ఇది software, documents మరియు files వంటివి Save చేయబడే భాగం. దీనిలో, data ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

Power Supply Unit

Power supply unit యొక్క పని ప్రధాన విద్యుత్ సరఫరా నుండి శక్తిని తీసుకొని అవసరానికి అనుగుణంగా ఇతర భాగాలకు సరఫరా చేయడం.

Expansion Card

అన్ని కంప్యూటర్లలో Expansion Slots ఉన్నాయి, తద్వారా భవిష్యత్తులో మనం Expansion Card ను జోడించవచ్చు. వాటిని PCI (Peripheral Components Interconnect) card అని కూడా అంటారు. ఈ రోజుల్లో Motherboard లో ఇప్పటికే చాలా స్లాట్‌లు నిర్మించబడ్డాయి. పాత కంప్యూటర్లను update చేయడానికి ఉపయోగించవచ్చు.

  • Video Card
  • Sound Card
  • Bluetooth Card (Adapter)
  • Network Card

కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్‌వేర్ |Computer Hardware and Software in Telugu

Hardware: Computer hardware అనేది మన కంప్యూటర్‌లో మనం ఉపయోగించే భౌతిక పరికరం అని చెప్పగలము.

ect.. ఎవన్నీ కంప్యూటర్ ని Navigate చయడానికి ఉపయోగించే Hardware devices అని చెప్పావచ్చు.

Software: Computer Software అంటే హార్డ్‌వేర్ రన్ అవ్వడానికి మన Machine హార్డ్ డ్రైవ్‌లో install చేసే కోడ్‌ల collection అని చెప్పవచ్చు.

ఉదాహరణకు: అదే విదంగా మనం వెబ్‌సైట్‌ను సందర్శించే Internet Browser మరియు ఆ ఇంటర్నెట్ బ్రౌజర్ నడుస్తున్న Operating System. ఇటువంటి వాటిని మనం Software అని పిలుస్తాము.

కంప్యూటర్ అనేది Software మరియు Hardware కలయిక అని మనం చెప్పగలం, రెండూ ఒకే పాత్రలను కలిగి ఉంటాయి, మరియు రెండూ కలిసి పనిచేయబడతాయి.

కంప్యూటర్ యొక్క రాఖలు | Types of Computer in Telugu

Computer అనే పదాన్ని మనం ఎప్పుడైనా వింటామో అప్పుడు మనం Personal కంప్యూటర్ యొక్క చిత్రం మాత్రమే మన మనస్సులోకి వస్తుంది. అయితే ఇందులో కూడా చాలా రకాల కంప్యూటర్లు ఉన్నాయని నేను మీకు చెప్తాబోతున్నాను. అవి వివిధ ఆకారాలు మరియు పరిమాణాలలో ఉంటాయి. డబ్బును తీయడానికి ఉపయోగించే  ATM, బార్‌కోడ్‌ను స్కాన్ చేయడానికి Scanner , పెద్ద calculation చేయడానికి  Calculator  వంటి అవసరాలకు అనుగుణంగా  వాటిని ఉపయోగిస్తాము. ఇవన్నీ వివిధ రకాల కంప్యూటర్లు.

Desktop

చాలా మంది ప్రజలు తమ ఇళ్ళు, పాఠశాలలు మరియు వారి Personal పని కోసం Desktop కంప్యూటర్లను ఉపయోగిస్తారు. అవి మన డెస్క్ మీద ఉంచే విధంగా రూపొందించబడ్డాయి. వాటికి Monitor, Keyboard, Mouse, కంప్యూటర్ Case వంటి అనేక భాగాలు ఉంటాయి.

Laptop

Battery తో నడిచే ల్యాప్‌టాప్‌ల గురించి మీకు తెలిసే  ఉండాలి, అవి చాలా portable  కాబట్టి వాటిని ఎక్కడైనా, ఎప్పుడైనా తీసుకెళ్లవచ్చు.

Tablet

ఇప్పుడు Tablet గురించి మాట్లాడుదాం, దీనిని Handheld కంప్యూటర్ అని కూడా పిలుస్తాము, ఎందుకంటే ఇది చేతితో సులభంగా పట్టుకోవచ్చు.

Keyboard మరియు Mouse లేదు, typing మరియు navigation కోసం ఉపయోగించే touch Sensitive స్క్రీన్. Example- ipad  .

Server

Server అనేది సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఉపయోగించే ఒక రకమైన కంప్యూటర్. ఉదాహరణకు, మనం ఇంటర్నెట్‌లో ఏదైనా Search చేసినప్పుడు ఆ విషయాలన్నీ Server లోనే store చేయబడతాయి.

కంప్యూటర్ ఉపయోగాలు | Uses of Computer in Telugu

1. శాస్త్రీయ పరిశోధన (Scientific Research)

పరిశోధన దారులు తమ పనికి సంబంధించిన లెక్కలు చేయడం అనేది చాలా కష్టమైన పనిగా భావించేవారు. పరిశోధన అభివృద్ధి లో చాలా సమయం మరియు శక్తి వృధా అయ్యేది. కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు కూడా జరిగేవి. అయితే ఈ రంగంలో కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీని కారణంగా పరిశోధన స్థాయి మరియు అనేక అభివృద్ధి జరిగింది. నేడు జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మొదలైన వాటిలో పరిశోధన చేయడానికి కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది.

2. వ్యాపారం (Business)

కంప్యూటర్ యొక్క వాడకం వ్యాపార కార్యకలాపాలలో ఒక విప్లవాత్మక వేగాన్ని తీసుకొచ్చింది. నేడు చాలా కార్యాలయాల్లో 80% పని కంప్యూటర్లతో జరుగుతుంది. ట్యాంక్ అకౌంటింగ్, వ్యక్తిగత సమాచారం, అకౌంటింగ్, సమాచార రికార్డు, వంటి మొదలైనవి అనేక పనులు కంప్యూటర్ సహాయంతో సులభంగా జరుగుతున్నాయి. కార్యాలయ సమావేశ పాత్రలను చక్కగా ఏర్పాటు చేసి వెంటనే ముద్రించవచ్చు. వ్యాపారానికి సంబంధించిన ఇతర పేపర్ వర్క్ లో కంప్యూటర్ లో చాలా ఉపయోగపడతాయి.

3. బ్యాంకింగ్ (Banking)

ఇప్పుడు ప్రతి బ్యాంకులో కంప్యూటర్ వాడకం చాలా సాధారణమైనది. ఎందుకంటే బ్యాంకు యొక్క ఖాతాదారుల వ్యక్తి గత రికార్డు ఉంచడం చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైన పాత్ర మరియు భవిష్యత్తులో ఎప్పుడైనా దాని నుండి సమాచారం కోరవచ్చు. కావున బ్యాంకులలో కంప్యూటర్ వాడకం ఎక్కువగా జరుగుతుంది.

4. టెలికాం (Telecom)

టెలికమ్యూనికేషన్ రంగంలో కంప్యూటర్ల వాడకం చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్ రంగంలో video conferencing, file sharing, web broadcasting, call centers మొదలైనవాటి కోసం కంప్యూటర్లు ఉపయోగించబడతాయి. మరియు విమాన ప్రయాణం, రైలు ట్రాఫిక్ నియంత్రణ, టెలిగ్రాఫ్ టెలిఫోన్ మొదలైనవి వాటి యొక్క ఆపరేషన్లకు కూడా కంప్యూటర్ల వాడకం జరుగుతుంది.

5. రవాణా (Transportation)

రవాణా వ్యవస్థను సౌకర్యవంతంగా చేయడానికి కంప్యూటర్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. రైల్వేలు, విమానాలు, బస్సులు మొదలైన వాటిల్లో టికెట్ లను బుక్ చేయడానికి కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విమానాల టేకాఫ్ మరియు ల్యాండింగ్, సరుకును లోడ్ చేయడం మరియు అన్‌లోడ్ చేయడం, ఎయిర్ ట్రాఫిక్ మరియు ఇతర ట్రాఫిక్ సంబంధిత విషయాలను పర్యవేక్షించడానికి కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఈ రోజు ట్రాఫిక్ సిగ్నలింగ్ కూడా కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది.

6. వైద్య (Medical)

మెడిసిన్ రంగంలో కూడా కంప్యూటర్లను బాగా ఉపయోగించబడుతున్నాయి. కంప్యూటర్ల సహాయంతో వివిధ రకాల పరీక్షలు చాలా త్వరగా చేయడం మరియు చాలా పర్ఫెక్ట్ గా చేయడం జరుగుతుంది. కావున కంప్యూటర్లను అనేక సంక్లిష్ట కార్యకలాపాలలో ఉపయోగిస్తున్నారు.

ఇది కాకుండా, స్టాక్ నియంత్రణ మరియు అమ్మకాలు, భీమా, నిర్వహణ సమాచారం, ఇంజనీరింగ్ డిజైన్, స్పేస్ సైన్స్, లైబ్రరీ మొదలైన అనేక ఇతర ప్రాంతాల్లో కంప్యూటర్లను ఉపయోగిస్తారు.

కంప్యూటర్ యొక్క ప్రయోజనాలు | Advantages Of Computer in Telugu

1.వేగంగా పనిచేయడం (Speed)

కంప్యూటర్ యొక్క పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఇది కొన్ని సెకన్లలో మిలియన్ల సార్లు calculate చేస్తుంది. ఒక వక్తీ ఒక సంవత్సరంలో చేయగల పని కంప్యూటర్ కేవలం కొన్ని నిమిషాల్లో చేయగలదు. దీనిని బట్టి కంప్యూటర్ ఎంత వేగమంతమైనదో తెలుసుకోవచ్చు.

2.ప్రెసిషన్(Precision)

కంప్యూటర్ తన పనిని ఎటువంటి పొరపాట్లు లేకుండా చేస్తుంది. కంప్యూటర్ కి మనం ఎలా ప్రోగ్రాం ఇస్తే అలా పనిచేస్తుంది. ఒకవేళ మనం తప్పుగా చెప్తే కంప్యూటర్ కూడా తప్పు చేస్తుంది. కావున మనం కంప్యూటర్ ని ఎలా ఉపయోంచాలని మన చేతుల్లో ఉంటుంది.

3.డాటా నిల్వ (Storage capacity)

డాటా ని save చేయడం. కంప్యూటర్ డాటా ని స్టోర్ చేసుకునే సమర్ద్యం గలది. దీని వలన కొన్ని వేల files లను కంప్యూటర్ నిల్వ ఉంచగలదు. ఆ files లను ఎప్పుడు కావాలన్న చూడవచ్చు. షేర్ చేయవచ్చు మరియు అనేక సంవత్సరాలు నిల్వ చేయవచ్చు. కంప్యూటర్ మన డాటాను సంవత్సరాలు నిల్వ ఉంచిన డాటా ను సురక్షితం గా ఉంచుతుంది.

4. సమర్థత (Efficiency)

ఒక మనిషి తమ సామర్ధ్యం కంటే ఎక్కువ పని చేస్తే కొంత సమయం తర్వాత అతను అలసిపోతాడు మరియు సమతుల్యత కోల్పోయి తప్పులు చేయడం ప్రాతంబిస్తాడు. కానీ కంప్యూటర్ ఒక ఎలక్ట్రానిక్ మెషీన్ కాబట్టి, పనిభారం ఎక్కువ ఉన్నప్పటికి ఎటువంటి తప్పులు చేయవు మరియు ఎంత పని అయిన చేస్తాయి. కానీ దానిని ఉపయోగించే మనిషి దానిని సరైన విదంగా ఉపయోగించాలి.

5.ప్రామాణికత (Authenticity)

నేటి కాలంలో ఒక వక్తీ ఇంకో వక్తీ తో విశ్వసించడం చాలా కష్టం గా మారింది. ఏ వక్తీ ఎవరికి ఎప్పుడు మోసం చేస్తాడో చెప్పలేం. కానీ కంప్యూటర్ కి స్వంత భావోద్వేగం ఉండదు. ఎటువంటి మోసం చేయదు. ఇందులో మీరు ఎంత ముఖ్యం మైన files అయిన సేవ్ చేసుకోవచ్చు. మరియు ఆ ఫైల్ ని కేవలం మీరు మాత్రమే చూడగలరు. కంప్యూటర్ అందులో ఎటువంటి మార్పులు చేయదని చెప్పవచ్చు.

6.అభివృద్ది (Development)

ఎప్పుడు ప్రతి రంగంలో కంప్యూటర్లను బాగా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ ద్వారా వ్యక్తి యొక్క పనిని చాలా వేగవంతంగా చేయవచ్చు. దీని సహాయంతో అనేక రంగం అభివృద్ది చెందుతుంది.

 కంప్యూటర్ యొక్క ప్రతికూలతలు | Disadvantages Of Computer in Telugu

1.నిరుద్యోగం (Unemployment)

కంప్యూటర్ ఉపయోగించి అనేక పనులు సులభంగా చేయడం మానందరికి తెలిసినదే. కానీ కంప్యూటర్ ఉపయోగించడం వల్ల అనేక మంది వ్యక్తులు చేసే పని ఒక కంప్యూటర్ చేయడం వల్ల అనేక మంది నిరుద్యోగులు గా ఉండిపోతున్నారు.

2. సమాచార దొంగతనం (Information Theft)

కంప్యూటర్ ఒక యంత్రం కాబట్టి దాని స్వంత భావోద్వేగాలు ఉండవు. కావున సమాచారాన్ని దొంగతనం చేయడం జరుగుతుంది. ఎలా అంటే హ్యాకర్లు కంప్యూటర్ లోకి ప్రవేశించి అవసరమైన డేటాను దొంగాలిస్తారు. కంప్యూటర్ లాంటి యంత్రాలలో ఈ ప్రమాదం ఉంటుంది.

3. కంప్యూటర్‌కు అలవాటు (Addiction to computer)

కంప్యూటర్ కి అలవాటు పడటం చాలా తీవ్రమైన సమస్య. కంప్యూటర్ కి అలవాటుపడటం అనేది ఒక వ్యక్తి సామాజికంగా ఇతర వక్తుల నుండి దూరంగా ఉంటాడు మరియు తన విలువైన సమయాన్ని వృధా చేస్తాడు. ఎలా మనుషులు కంప్యూటర్ కి బానిసలు అవ్వుతున్నారు. ఇది మంచిది కాదు.

4. కంటి ప్రమాదం (Eye Risk)

కంప్యూటర్ స్క్రీన్ కి Anti-glare element ఉండదు. దాని వల్ల కంప్యూటర్ నుండి వెలువడే కిరణాలు కళ్లపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కావున కంప్యూటర్ ని గంటల వరకు ఉపయోగించడం ద్వారా కంటికి అనేక సమస్యలు ఉన్నాయి.

5.ఆరోగ్య ప్రమాదం (Health Risk)

కంప్యూటర్ ముందు గంటల వరకు కూర్చొని పనిచేస్తే ఆ వ్యక్తి కి ఊబకాయం పెరిగిపోతుంది. దీని కారణంగా గుండెకు సంబందించిన సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాకుండా ప్రతి రోజు ఎక్కువ చేపు కంప్యూటర్ ని ఉపయోగించడం ద్వారా వెన్నునొప్పి మరియు మెదనొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఇదికూడా చదవండి : క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి ? దీని ఉపయోగాలు 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here