సోపు గింజలు వల్ల కలిగే 14 ఆరోగ్య ప్రయోజనలు | Fennel Seeds in Telugu

0

About Fennel seeds in Telugu: ఈ రోజు మేము మీకు వంటగదికి రుచిని అందించే చిన్న సోపు గింజల గురించి చెప్పాబోతున్నాం. వీటిని ఇంగ్లిష్ లో fennel seeds అని పిలవడం జరుగుతుంది. ఈ సోపు గింజలను కేవలం వంట గదుల్లో కాకుండా హోటల్స్, రెస్టారెంట్ లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే సోపు గింజలు ఆహారాన్ని రుచికరం గా మరుస్తాయి. మరియు ఏది మౌత్ ఫ్రెషర్ గా పనిచేస్తుంది. అయితే సోపు గింజలు ఆహారాన్ని రుచి చేయడానికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉపయోగించడం జరుగుతుంది.

మిత్రులారా మీరు విన్నది నిజమే ఈ ఫెన్నెల్ సీడ్స్ ఒక ఔషధం లాంటిది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఫెన్నెల్ సీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను మరియు వీటిని ఎలా ఉపయోగించాలో ఈ వ్యాఖ్య ద్వారా తెలుసుకుందాం.

Table of Contents

సోపు గింజలు అంటే ఏమిటి ? – What is Fennel seeds 

fennel seeds in teluguసోపు గింజ అనేది ఒక స్థానిక మూలిక. ఇది లేత లేదా ముదురు ఆకుపచ్చ రంగు కలిగినా ఒక్ సుగంధ విత్తనాలు గా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఊరగాయల మసాలాగా మరియు ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ సోపు గింజలను ఆంగ్లంలో ఫెన్నెల్ సీడ్స్(Fennel seeds) అంటారు. ఫెన్నెల్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కావున దీని ఆయుర్వేదంలో ఔషదంగా ఉపయోగిస్తారు. ఫెన్నెల్ సీడ్స్ లో అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి అనేక రకాల శారీరక వ్యధులను నయం చేయడం లో ప్రయోజకరంగా ఉంటాయి. ఇంత ప్రయోగకరంగా ఉన్న ఈ సోపు గింజల గురించి మరింత తెలుసుకుందాం.

సోపు మొక్క ఎలా ఉంది? – How is the Fennel plant

చాలా మంది ఈ సోపు గింజలను తినే ఉంటారు. కానీ చాలా మందికి దాని యొక్క మొక్క ఎలా ఉంటుందో తెలియాడు. కాబట్టి ఫెన్నెల్ మొక్క గురించి తెలుసు కుందాం. సదరణం గా ఫెన్నెల్ మొక్క శ్యాస్వత మొక్క అని చెప్పవచ్చు. ఇది గుల్మకాండ మొక్క అయిన అపియాసి కుటుంబానికి చెందినదని. ఇది ఒకటి నుండి రెండు మీటర్ల పొడవు ఉంటుంది. ఈ మొక్క ప్రతి సంవత్సరం సాగు చేయబడుతుంది. దీనిని సుగంధ మూలికగా ఉపయోగిస్తారు. 

పెన్నెల్ మొక్కలో చిన్న పసుపు రంగు కలిగి ఉన్న పువ్వులు ఉంటాయి. ఈ పువ్వులలో సోపు గింజలు కనిపిస్తాయి. దీని రంగు ఆకుపచ్చ మరియు జీలకర్ర ఆకారంలో ఉంతుంది. అయితే ఈ ఫెన్నెల్ వితనలు రెండు రూపాల్లో కనిపిస్తాయి. వీటిలో ఒకటి చిన్నవిగా ఉంటాయి. వాటిని చెన్న ఫెన్నెల్ అని పిలుస్తారు. మరియు మరొక రకం పెద్ద ఫెన్నెల్ అని పిలుస్తారు. మిత్రులారా కేవలం ఫెన్నెల్ యొక్క గింజలను మాత్రమే ఔషధం గా ఉపయోగించారు దానితోపాటు ఫెన్నెల్ మొక్కాలోని ప్రతి భాగాన్ని ఔషధం గా ఉపయోగించ బడుతుంది. అంటే వితనలు, ఆకులు, పువ్వులు, మరియు మూలాలు మొదలైనవి. 

ఫెన్నెల్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? – Where is Fennel seeds produced

ఫెన్నెల్ యొక్క ఉత్పత్తి మూలం యూరప్ గా పరిగణించబడుతుంది. కానీ ఇది వాణిజ్య మసాలా దినుసు కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తారు. అయితే మన భారతదేశంలో, ఫెన్నెల్ ప్రధానంగా మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఒరిస్సాలో ఉత్పత్తి అవుతుంది. గుజరాత్ Saunf-11, గుజరాత్ Saunf-12, NPK1, NPJ26, RF 143 మరియు RF 101, PF 35 వంటివి సోపు ఉత్పత్తిలో మెరుగైన రకాలుగా పరిగణించబడతాయి.

సోపు గింజల యొక్క పోషకాలు – Nutrients of Fennel seeds in telugu

సోపూ ఒక త్రిదోష నివారణ అనిచెప్పవచ్చు ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మరియు దీనితో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఇనుము, భాస్వరం, ఫోలేట్, విటమిన్ కె, కార్బోహైడ్రేట్, సోడియం, ఫైబర్, నియాసిన్, విటమిన్ డి, సెలీనియం, పాంతోతేనిక్ ఆమ్లం, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ- తాపజనక అంశాలు ఉన్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి చాలా ప్రయోజకరంగా ఉంటాయి.

ఫెన్నెల్ యొక్క వివిధ పేర్లు – Some other names of Fennel seeds in Telugu 

భారతదేశం ఒక బహుభాషా దేశం, ఇక్కడ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత భాష ఉంటుంది. కాబట్టి ఫెన్నెల్‌ను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే ఈ వివిధ రకాల ఫెన్నెల్ పేర్లు ఏమిటో తెలుసుకుందాం.

 • హిందీలో ఫెన్నెల్ పేరు – చిన్న సోంపు, పెద్ద సోంపు
 • సంస్కృతంలో సోపు పేరు – షలీన్ మరియు మాధురిక
 • తమిళంలో సోపు పేరు – సోహికిరే
 • గుజరాతీలో ఫెన్నెల్ పేరు – వలియారి
 • పంజాబీలో సోపు పేరు – సోంపు
 • మలయాళంలో సోపు పేరు – కట్టుసత్కుప్ప
 • మరాఠీలో ఫెన్నెల్ పేరు – బడి సేపు
 • బెంగాలీలో సోపు పేరు – పాన్ మౌరి
 • కన్నడంలో ఫెన్నెల్ పేరు – సబ్సిసిజ్

సోపు గింజల యొక్క ప్రయోజనలు – Benefits of Fennel Seeds 

ఇప్పుడు వరకు సోపు గింజలలో ఏఏ పోషకాలను కలిగి ఉంటాయో మనం తెలుసుకున్నాం. అయితే సోపుగింజల యొక్క ప్రభావం చల్లగా ఉంటుంది. మరియు  ఇవి మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా చేసే అనేక ఆరోగ్య – ప్రోత్సాహక అంశాలను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను అంతం చేయడం లో ఫెన్నెల్ బాగా ప్రయోజకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫెన్నెల్ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. సోపుతో నోటిపూతను నాశనం చేయండి

నోటిలో బొబ్బలు అనేది పిల్లల నుండి పెద్దల వరకు వచ్చే ఒక సాధారణ సమస్య. దీనిని నోటిపూత అని అంటారు. అయితే ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దీనికి ప్రధానంగా జ్వరం కారణం గా అనిచెప్పవచ్చు. ఇవి రావడం వల్ల నోటిలోపల ఇబ్బందిగా ఉంటుంది. మరియు తినడానికి , మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి దీనిని నివారించడం చాలా ముఖ్యం.

నోటి పుండ్లను నయం చేయడంలో ఫెన్నెల్ సీడ్స్ చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఎందుకంటే ఫెన్నెల్ సీడ్స్ లో మిటమిన్ సి మరియు విటమిన్ B6 మూలకాలు ఉన్నాయి. ఒక టీస్పూన్ ఫెన్నెల్ , చేటికెడు పసుపు, బే ఆకు మరియు చిటికెడు అల్లం, చిటికెడు నీటిలో కలిపి మరిగించిన తర్వాత గర్లింగ్ చేయడం వల్ల నోటి సమస్యలను నివారించవచ్చు.

2. సోపుతో ఊబకాయాన్ని తగ్గించండి

ఊబకాయం వల్ల మనిషి లావుగా మారడం జరుగుతుంది. దీని వల్ల అనేక సమస్యలు రావడం జరుగుతుంది. అయితే ఫెన్నెల్ సీడ్స్ ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. కావున కొన్నేళ్లుగా బరువును రాగ్గించడానికి ఆయుర్వేద మందులలో ఈ ఫెన్నెల్ ను ఉపయోగించబడుతుంది.

సోపు లో మెగ్నీషియం, పొటాషియం మరియు డైటరీ ఫైబర్ ఉంటాయి, ఇవి బరువును తగ్గించడం లో చాలా ఉపయోగపడతాయి. దీనికి ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోపును మరిగించి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే అది బరువును తగ్గిస్తుంది అలాగే అధిక కొవ్వును తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. 

3. సోపుతో రక్తాన్ని శుభ్రం చేయండి

రక్తాన్ని శుద్ది చేయడం అంటే శరీరంలోని రక్తాన్ని సుబ్రంచేయడం. మానవ శరీరంలో రక్తంలో విషపదార్ధాలు కనిపించినప్పుడు ఆ ప్రక్రియను అశుద్ద రక్తం అంటారు. మానవ శరీరంలో అపరిశుభ్రమైన రక్తం అనేక వ్యాధులకు కారణం. దీని వలన అనేక మానసిక వ్యదులు మరియు శారీరక వ్యదులు, చర్మ వ్యదుల ప్రమాదం పెరుగుతుంది. కావున ప్రతి వ్యక్తి రక్తాన్ని శుద్దిచేయడం చాలా ముఖ్యం.

అయితే సోపుతో రక్తాన్ని శుద్ది చేయవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుద్ది చేయడానికి చాలా సహాయపడుతాయి. ప్రతి రోజు ఫెన్నెల్ తీసుకోవడం ద్వారా విషపూరితమైన కణాలు మూత్రం ద్వారా తొలగించబడతాయి. దీని కారణంగా శరీరం యొక్క రక్తం స్వచ్చంగా మారుతుంది.

4. సోపుతో ఆకలిని పెంచండి.

అధిక ఆకలి లేదా తక్కువ ఆకలి, ఈ రెండు మనిషి శరీరానికి మంచిది కాదు. అయితే ఎక్కువగా ఆకలి లేకపోవడం అనేది జరుగుతుంది. ఇది పెద్దలు మరియు పిల్లలలో కూడా ఉంటుంది. శరీరానికి తగినంత శక్తి అందకపోస్తే ఆ మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి శక్తి మనిషి తినే ఆహారంలో వస్తుంది. కావున ఆకలి ఉండటం చాలా ముఖ్యం.

ఫెన్నెల్ లో విటమిన్ సి, థయామిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఆకలిని పెంచడంలో సహాయపడతాయి. మరి దీనికి సోపు, క్యారమ్ గింజలు, ఇంగువ, ఏలకులు వీటిని పొడి చేసి తినడం ద్వారా ఆకలి సమస్య ముగుస్తుంది.

5. సోపుతో మలబద్దకాన్ని తగ్గించండి

కడుపుని సుబ్రంచేయడానికి మరియు మలమద్దకాన్ని తొలగించడానికి ఫెన్నెల్ ఒక ఖచ్చితమైన మార్గం. మలబద్దకం సమస్యం రోజురోజుకూ పెరుగుతుంది. కానీ ప్రజలు దీనిని నయంచేయడానికి అనేక చర్యలు, మందులు తీసుకుంటున్నారు. కానీ మనం దీనిని ఎటువంటి మందులను ఉపయోగించకుండానే దూరం చేయవచ్చు. మలబద్దకాన్ని నయం చేయడానికి శతాబ్దాలుగా ఫెన్నెల్ ఉపయోగించబడుతుంది. 

ఎందుకంటే ఫెన్నెల్ లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి 12 ఉన్నాయి, ఇవి రూట్ నుండి మలబద్ధకాన్ని తొలగించడంలో ఉపయోగపడతాయి. మరి దీనికి ఒక చెంచా ఫెన్నెల్ మరియు ఒక చెంచా క్యారమ్ విత్తనాలను ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయాన్ని తయారు చేసి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మలబద్దకానికి గొప్ప ప్రయోజనం లభిస్తుంది.

6. సోపుతో దగ్గుని తగ్గించండి.

దగ్గు ఒక సాధారణ సమస్య ఇది వాతావరణం మార్పు లేదా దా తప్పు ఆహారా పదార్థాలను తినడం వలన కలుగుతుంది. దీని కారణంగా మనిషి చాలా బాధపడతాడు మరియు సరైన నిద్ర పట్టదు, కొన్ని కొన్ని సార్లు కడుపు యొక్క నరాలు దెబ్బతినడం మొదలవుతాయి. దగ్గు ఒక సాధారణ సమస్య అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడని వ్యాధి. కాబట్టి వెంటనే చికిత్స చేయించుకోవడం చాలా మంచిది. అయితే దగ్గు నయం చేయడానికి ఫెన్నల్ సీడ్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కావున మీరు ఫెన్నెల్ ఉపయోగించి కూడా దగ్గును వదిలించుకోవచ్చు.

7. సోపు తో మూత్ర ఇన్ఫెక్షన్ నివారణ

మూత్రం లో ఇన్ఫెక్షన్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఏ సీజన్లో అయినా సంభవించవచ్చు. ఇది అనేక కారణాల వల్ల సంబావిచవచ్చు. అయితే ఇక్కడ మేము మీకు మూత్ర సంక్రమణ నివారణ గురించి చెప్పబోతున్నాం. అవును సోపు గింజలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మూత్ర ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఫెన్నెల్ కషాయాన్ని తాగడం వల్ల మూత్ర ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు. 

8. సోపు తో జీర్ణవ్యవస్థ బలపరచండి.

జీర్ణవ్యవస్థ క్షీణత సరిహానికి చాలా హానికరం. సరైన జీర్ణవ్యవస్థ వలన శరీరం ఫిట్ గా  మరియు అరిగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మనం తినే ఆహారాన్ని శక్తి గా మార్చి మనల్ని ఆరోగ్య వంతులుగా మరియు బలవంతులుగా మారుస్తుంది. కావున జీర్ణవ్యవస్తా ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఫెన్నెల్ సీడ్స్ ని రోజు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ను ఆరోగ్యంగా చేస్తుంది. దీని కోసం రోజు ఆహారంలో తిన్న తర్వాత కొంచం సోపుని నమలండి.

9. సోపు తో జ్ఞాపకశక్తిని పెంచండి.

జ్ఞాపకశక్తిని పెంచడానికి బాదం చాలా ఉపయోగపడుతుంది అని మానందరికి తెలుసు కానీ బాదం కొంతమదికి తినడం నచ్చదు. మరియు బాదం చాలా ఖరీదైనది అయితే సోపు గింజలతో కూడా జ్ఞాపకశక్తిని పెంచవచ్చు అని మేము మీకు చెప్పలనుకుంటున్నాము. ఎదుకంటే సోపు లో విటమిన్ బి 6, జింక్, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్స్, ప్రోటీన్, విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మెదడుని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయోజకరంగా ఉంటాయి. దీని కోసం సోపు తో చేసిన టి త్రాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది మరియు దానితోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

10. సోపుతో కడుపు సమస్యలు నివారణ

సోపు గింజలతో కడుపు లో సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంటే పొత్తికడుపు విస్తరణ, ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం, కడుపు నొప్పి మొదలైన సమస్యలను దూరంచేసుకోవచ్చు. ఎదుకంటే సోపులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి 12, కార్బోహైడ్రేట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కడుపుకి సంబందించిన సమస్యలను దూరం చేయడంలో చాలా సహాయపడుతాయి. 

11. సోపుతో రుతుక్రమం సమస్యలు నివారణ

రుతుక్రమం సమస్యను ఒలిగోమెనోరియా అంటారు. దాదాపు 50% మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కౌమారదశలో ఉన్న బాలికలకు రుతుస్రావం ప్రారంభ కాలంలో క్రమరహిత కాలాలు వస్తాయి. అయితే ప్రతిసారీ రుతుక్రమం సక్రమంగా రాకపోతే అది అనేక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటే ముందుగా వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఆ తర్వాత ఇంట్లో సహజ నివారణలు ఉపయోగించవచ్చు. మీరు సోపు పొడి లేదా సోపు కషయాలను ఉపయోగిస్తే ఇటువంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

12. సోపుతో నోటి దుర్వాసనను తొలగించవచ్చు. 

నోటిలో దుర్వాస రావడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఇది వ్యక్తికి మానసిక మరియు శారీరక సమస్యలను కలిగించడమే కాకుండా, వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నోటి నుండి వచ్చే చెడు వాసన కొన్నిసార్లు క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది, కావున నోటి దుర్వాసనకు కారణాన్ని తెలుసుకోవడం మరియు వీలైనంత త్వరగా చికిత్స చేయడం చాలా ముఖ్యం. సోపు చాలా మంచి మౌత్ ఫ్రెషనర్ అని చెప్పబడింది. సోపులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి నోటి దుర్వాసనను సులభంగా తగ్గించడంలో సహాయపడతాయి.

13. సోపు తో చర్మ సమస్యలు దూరంచేయండి.

చర్మం పై దురద, దద్దుర్లు, మచ్చలు, ముడతలు, మొటిమలు ఉన్నవారు సోపు గింజలను ఉపయోగించవచ్చు. ఫెన్నెల్ చర్మ సమస్యలను దూరం చేయడంలో ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ప్రోటీన్, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు చర్మం యొక్క సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి.

14. సోపు తో డయాబెటిక్ తగ్గించండి.

సోపు తో డయబెటిస్ ని అదుపులో పెట్టవచ్చు. ఎందుకంటే రక్తంలో చెక్కర స్థాయి పెరగడం మనిషికి చాలా హానికరం. అయితే సోపును ఉపయోగించి డయాబెటీస్ ని తగ్గించవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం తో పాటు డయాబెటీస్ తగ్గిస్తాయి.

సోపు గింజలను ఎలా ఉపయోగించాలి ? – How to Use Fennel seeds 

మిత్రులారా, ఫెన్నెల్ యొక్క ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత, దీని ఎలా ఉపయోగించబడుతుందనే ప్రశ్న మీ మనస్సులో వస్తుంది. కాబట్టి మీరు ఫెన్నెల్ ఎలా మరియు దేనితో ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

 1. సోపు గింజలు లేదా సోపు ఆకులతో అల్లం పొడిని కలపి టీగా ఉపయోగించవచ్చు.
 2. ఫెన్నెల్, బాదం, నల్ల మిరియాలు తందాయ్ తయారీలో ఉపయోగిస్తారు.
 3. మీరు ఫెన్నెల్ వాటర్ చేయడానికి ఫెన్నెల్ ఉపయోగించవచ్చు.
 4. ఫెన్నెల్ పౌడర్ తయారు చేయడం ద్వారా ఉపయోగించబడుతుంది.
 5. ఫెన్నెల్ చట్నీ తయారు చేయడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు.
 6. ఫెన్నెల్ ఆకులను రసం రూపంలో ఉపయోగించవచ్చు.
 7. ఊరగాయ సుగంధ ద్రవ్యాల రుచిని పెంచడానికి ఫెన్నెల్ ఉపయోగించవచ్చు.
 8. పప్పు, బఫిల్స్‌లో రుచిని పెంచడానికి ఫెన్నెల్ ఉపయోగించవచ్చు.
 9. మిశ్రీ మరియు ఫెన్నెల్ మౌత్ ఫ్రెషనర్‌లుగా ఉపయోగిస్తారు.
 10. ఫెన్నెల్ కూరగాయలు మరియు పరాథాలలో ఉపయోగించవచ్చు.

సోపు గింజల యొక్క దుష్ప్రభావాలు – Side Effects Of Fennel Seeds

సోపు గింజలలో దొరికే పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనలు తెలుసుకున్నాం. కానీ సోపు గింజల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అని చెప్పాలనుకుంటున్నాను, అయితే నష్టాలు ఫెన్నెల్ యొక్క ప్రయోజనాల కంటే చాలా తక్కువ. కానీ నష్టం ఎక్కువైన తక్కువైన నష్టం నష్టమే. అయితే మనం అవేంటో తెలుసుకుందాం.

 1.  ఫెన్నెల్ యొక్క ప్రభావం చల్లగా ఉంటుంది. కాబట్టి జలుబు ఉన్న వారు సోపుని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది లేదా అసలు తీసుకోకపోవడం మంచిది.
 2. బిడ్డకి పాలిచ్చే మహిళలు ఫెన్నెల్ తీసుకోవడం వలన హానికరమైనదిగా పరిగనించబడుతుంది. కాబట్టి పాలిచ్చే మహిళలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఫెన్నెల్ ని తినాలి.
 3. ఎక్కువ ఫెన్నెల్ ని తీసుకోవడం వల్ల ఎండలో వెళ్లినప్పుడు వెంటనే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here