క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి ? దేనికి ఉపయోగపడుతుంది | What is Cloud Computing in Telugu

0
103

ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతుందో. అదేవిదంగా రోజు రోజుకి ఏదో ఒక కొత్త technology కనిబెట్టడం జరుగుతుంది. మనం ప్రపంచంతో దశలవారీగా నడవాలనుకుంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అయితే గత కొద్ది కాలం నుంచి ఒక కొత్త టెక్నాలజి ని వింటున్నాము అది Cloud Computing | మొత్తానికి ఏది ఏంటీ, ఈ Cloud Computing ఎలా పని చేస్తుంది? దీని వల మనకు ప్రయోకాణాలు ఏమిటి? (Cloud Computing in Telugu) అనేది మనం ఎక్కడ పూర్తి సమాచారం తో తెలుసుకుందాం.

Table of Contents

Cloud Computing అంటే ఏమిటి? | What is Cloud Computing in Telugu

cloud computing in telugu

Cloud Computing ఇది ఎలాంటి టెక్నాలజి అంటే internet ని ఉపయోగించి అనేక విభిన్న సేవలను (services) వాడవచ్చు. ఈ సేవలు ఏదైనా కావచ్చు. అది ఏదైనా software కావత్చు లేదా surver లోని stotage space అవత్చు లేదా ఏదో ఒక (services).

cloud computing meaning in telugu: ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అర్దం ఏమిటంటే ఏదో ఒక కంప్యూటింగ్ సర్విస్ ని ఇంటర్నెట్ ద్వారా వినియోగదారులకు అందించడం.

సింపుల్ భాష లో చెప్పాలంటే Cloud Computing టెక్నాలజి లో ఒక వినియోగదారికి ఇంటర్నెట్ లో ఉన్న ఒక సుర్వర్ మీద (దానిని మనం క్లౌడ్ అంటాం) Data storage యొక్క సదుపాయం అందించడం జరుగుతుంది. దీనిని user క్లౌడ్ స్పేస్ ని కొనవలిసి ఉంటుంది. దానిలో తమ Data ను Save చేసుకోవచ్చు మరియు తమ డాటా ను ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా access చేయవచ్చు. 

Cloud Computing ఉదాహరణలు | Examples Of Cloud Computing in Telugu

Cloud Computing టెక్నాలజి లో ఉదాహరణగా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ అందులో మూడు ముఖ్యంగా వాడే వాటిని చెప్తాము.

1. youtube : ప్రసిద్ధ వీడియొ షేరింగ్ platfoam అయిన Youtube లో కొన్ని లక్షల వీడియొలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతమొత్తం వీడియొ లను స్టోర్ చేసుకోవడానికి యూట్యూబ్ Cloud Computing టెక్నాలజి ని ఉపయోగిస్తుంది.

2. facebook : ఫేస్బుక్ లాంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ఫోమ్ లో కొన్ని కోట్ల లక్షల మంది ప్రొఫైల్ ఉంది మరియు చాలా డాటా స్టోర్ అయిఉంది ఇంతమొత్తం డాటా ని ఉంచడానికి ఫేస్బుక్ Cloud Computing ని ఉపయోగిస్తుంది.

3.Emails : email సేవను అందించే అన్ని కంపెనీలు (ఉదా. Gmail, Rediff, yahoo) మరియు డ్రాప్‌బాక్స్, యాండెక్స్, మీడియా ఫైర్, మెగా వంటి ఆన్‌లైన్ storage space అందించే అన్ని కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఉపయోగిస్తాయి.

Cloud Computing యొక్క చరిత్ర | History Of Cloud Computing in Telugu

Cloud Computing ప్రారంభం 1960 లలో పరిగణించబడింది. అప్పుడు ఇంటర్నెట్ కూడా సరిగ్గా ప్రారంభించబడలేదు. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క నిజమైన ప్రారంభం 30 నుండి 40 సంవత్సరాల తరువాత 1990 లో జరిగింది Salesforce అనే సంస్థ తన వెబ్‌సైట్ సేవలను ప్రజలకు అందించడం ప్రారంభించింది. అప్పటి నుండి ప్రజలు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించారు మరియు ఆ తరువాత మాత్రమే రాబోయే కాలంలో ఇది ఎంత ముఖ్యమైనదో నిరూపించబడింది. చాలా సంవత్సరాల తరువాత, ఈ రంగం moment అందుకుంది మరియు 21 వ శతాబ్దంలో రావడం ద్వారా, అమెజాన్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి అనేక పెద్ద కంపెనీలు Cloud Computing రంగంలో తమ సేవలను అందించడం ప్రారంభించాయి.

Cloud Computing ఎలా పని చేస్తుంది | How Cloud Computing works

Cloud Computing ‌లో, చాలా సర్వర్లు అనగా ఒక నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ install  చేయబడిన కంప్యూటర్లు ఉపయోగించబడతాయి. ఇది ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. దీనికి చాలా softwares ఉంటాయి . Cloud Computing  ప్రాథమికంగా Dual layers technology పై పనిచేస్తుంది. సర్వర్ ని మానేజ్ చేయదనికి ఒక వేరే లేయర్ ని ఉపయోగించబడుతుంది దానిని back end అంటారు. మరియు క్లయింట్లు ఉపయోగించే రెండవ పొరను front end అంటారు. ఈ విదంగా back end మరియు front end రెండిటినీ కలిపి ఒక Cloud Computing ని setup చేస్తారు.

Cloud Computing యొక్క రకాలు | Types Of Cloud Computing in Telugu

Cloud Computing ని రెండు వేరువేరు రాఖలుగా విభజించడం జరిగింది. 

(A). Deployment యొక్క ఆధారంగా

(B). క్లౌడ్ ద్వారా ఇవ్వబడే సేవ యొక్క ఆధారంగా

Deployment యొక్క ఆధారంగా Cloud Computing లోని కొన్ని రకాలు

1. పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ (Public Cloud Computing)

పబ్లిక్ క్లౌడ్ అనేది ప్రతి వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటుంది మరియు యు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ కొన్ని కొన్ని సార్లు ఫ్రీగా అందించబడతాయి. ఇక్కడ వీళ్ళ కోసం చాలా తక్కువ ఛార్జ్ చెల్లించబడతాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS), మైక్రోసాఫ్ట్ azure ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఉదాహరణలు.

2.ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ (Private Cloud Computing)

ప్రైవేట్ Cloud Computing యొక్క సర్వీస్ మరియు నెట్వర్క్ ఒక ప్రైవేట్ క్లౌడ్ మీద స్టోర్ చేయబడి ఉంటాయి. ఇందులో యూజర్ తమ క్లౌడ్ స్టోరేజ్ నీ వేరే వ్యక్తితో షేర్ చేయలేడు. గూగుల్ డ్రైవ్ ఒక ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తమ యొక్క డేటా తమ ఈమెయిల్  మరియు పాస్వర్డ్ ద్వారా క్షేమంగా ఉంచుకోవచ్చు.  మరియు ఇందులో మీ యొక్క డ్రైవ్ మీరు తప్ప ఇంకో వేరే వ్యక్తి ఉపయోగించలేడు. 

3. కమ్యూనిటీ క్లౌడ్ కంప్యూటింగ్ (Community Cloud Computing)

కమ్యూనిటీ క్లౌడ్ కంప్యూటింగ్ ఒక సమూహ వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఇతర బాహ్య వ్యక్తి ఈ డేటాను access చేయలేడు. ఉదాహరణకు, ప్రభుత్వ కార్యాలయం కోసం, దాని ఉద్యోగులు మాత్రమే దాని సైట్‌లో లభించే Data ను ఉపయోగించగలరు లేదా ఆ విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు మాత్రమే యునివర్సిటి సృష్టించిన Website లో లభించే సేవలను ఉపయోగించగలరు.

4.హైబ్రిడ్ క్లౌడ్‌ కంప్యూటింగ్ (Hybrid Cloud Computing)

hybrid Cloud లో ప్రైవేట్ క్లౌడ్ మరియు పబ్లిక్ క్లౌడ్ రెండూ ఉపయోగించబడతాయి. ఒక సైట్‌లోని కొంత కంటెంట్ రిజిస్టర్డ్ వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటే మరియు కొంత కంటెంట్ ప్రజలకు అందుబాటులో ఉంటే అటువంటి క్లౌడ్‌ను హైబ్రిడ్ క్లౌడ్ అంటారు.

(B). క్లౌడ్ ద్వారా ఇవ్వబడే సేవ యొక్క ఆధారంగా

1. Iaas (Infrastructure as a service)

 ఈ రకమైన సేవలో, క్లౌడ్ కంప్యూటింగ్ పవర్ , నిల్వ, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్ శక్తి మరియు క్లౌడ్ యొక్క అన్ని ఇతర నియంత్రణలు వినియోగదారు వద్ద ఉంటాయి. ఈ సేవ ని ప్రాథమికంగా Bissness కోసం ఉపయోగించబడుతుంది. దీనికి అతిపెద్ద ఉదాహరణ VPS అనగా వర్చువల్ ప్రైవేట్ సర్వర్. దీనిలో మీరు సాఫ్ట్‌వేర్ మరియు నెట్‌వర్క్‌తో పాటు కంప్యూటింగ్ శక్తిని పొందుతారు.

2. Paas (Platform as a service)

Paas(Platform as a service) లో వినియోగదారుకు ఒకే ప్లాట్‌ఫాం లభిస్తుంది. ఇది storage లేదా కంప్యూటింగ్ శక్తిని కలిగి ఉంటుంది, దీనిలో మీరు విషయాలను పూర్తిగా నియంత్రించలేరు, వాటిని క్లౌడ్ ప్రొవైడర్ మాత్రమే నియంత్రించగలరు. దాని ఉదాహరణలు Gmail, Rediff, Yahoo మొదలైనవి.

3. Saas (Software as a service)

Saas (Software as a service) లో మీరు రిమోట్ సర్వర్‌లో హోస్ట్ చేసిన ఒక సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే పొందుతారు, ఇది ఒక నిర్దిష్ట పని కోసం ఉపయోగించబడుతుంది. ఈ రకమైన సేవలను ఎక్కువగా చిన్న వ్యాపారాలలో ఉపయోగిస్తారు. ఈ రకమైన సేవలో గూగుల్ డాక్స్ ఆన్‌లైన్ లేదా గూగుల్ జిసూయిట్ వంటి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇవన్నీ saas యొక్క ఉదాహరణలు.

 Cloud Computing లాభాలు | Advantages Of Cloud Computing in Telugu

1. యోక్కువ స్టోరేజ్  (Large storage)

ఇందులో మీ యొక్క డాటా Cloud లో save చేయడం జరుగుతుంది. నిదులో మీకు కావల్సినంత స్టోరేజ్ ని వాడవచ్చు మరియు పెంచవచ్చు.

2.సులభంగా డాటా ఆక్సెస్ చేయడం (Ease of Data Access)

Cloud మీద డాటా స్టోర్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే మీరు ఎక్కదంటే అక్కడ ఎప్పుదంటే అప్పుడు ఏదైనా device లో access చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు internet కనెక్షన్ ద్వారా క్లౌడ్ ని ఆక్సెస్ చేయవచ్చు.

3. ఎక్కువ ప్రొసెసింగ్ పవర్  (Large processing power)

Cloud Computing లో మీకు Processing పవర్ తో రాజీపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మీకు ఎంత కావాలో అంత ప్రొసెసింగ్ పవర్ ఖరీదు చేసి ఉపయోగించవచ్చు.

4. తక్కువ ధర (Less price)

Cloud Computing లో మీరు మీ అవసరానికి అనుగుణంగా storage space కొనుగోలు చేయవచ్చు మరియు మీరు ఆ మొత్తాన్ని మాత్రమే చెల్లించవచ్చు. ఉదాహరణకు, మీకు GB 20 storage అవసరమైతే, మీరు ఆ 20 GB కి సరిపడే అంతా డబ్బు మాత్రమే చెల్లించి కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు 500 GB హార్డ్ డిస్క్ కొనవలసిన అవసరం లేదు.

ఐతే ఇది ఫ్రెయిండ్స్ Cloud Computing కి సంబందించిన ముఖ్య సమాచారం మాకు తెలిసి  Cloud Computing అంటే ఏమిటి? (what is Cloud computing in Telugu) మీకు అర్డమైఉంటుంది. ఫ్రెయిండ్స్ మీకు ఈ సమాచారం ఎలా అనిపించిందో మకు కామెంట్ సెక్షన్ లో చెప్పగలరు మరియు ఈ పోస్ట్ ని సోషల్ మీడియా లో షేర్ చేయగలరు. 

మాతో కనెక్ట్ అవ్వడానికి పక్కనా ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి Allow బటన్ మీద క్లిక్ చేయండి మరెన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here